ఎల్ఆర్ఎస్ చార్జీలు వద్దు!

by Ravi |   ( Updated:2024-02-28 00:15:36.0  )
ఎల్ఆర్ఎస్ చార్జీలు వద్దు!
X

గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్) చార్జీలు వసూల్ చేస్తామని అంటే, నాడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ప్రకటనలను ఇచ్చారు. దీనిని రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినప్పుడు సైతం కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేశారు. పైగా ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్ లాగానే మ్యారేజ్ రెగ్యులరైజ్ స్కీమ్ కూడా తెస్తుందేమో అని ప్రస్తుత సీఎం అప్పటి సీఎంను విమర్శించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను తెరమీదికి తెచ్చి.. మార్చి 31 లోగా దీనిని కట్టమని చెప్పడం సమంజసం కాదు. ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియ. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం గ్రామ పంచాయితీకో, మున్సిపల్ ఆపీస్‌కో వెళ్ళినప్పుడు పర్మిషన్ చార్జెస్‌తో పాటుగా ఎల్ఆర్ఎస్ చార్జెస్ తీసుకొని నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎల్ఆర్ఎస్ చార్జెస్ పే చేయాల్సిన అవసరం దరఖాస్తుదారులకు లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన వారు 10 వేలు కట్టి ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు వారికి మాత్రమే ఎల్ఆర్ఎస్ చార్జెస్ తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్‌లకు అనుమతి ఇస్తే కొనుగోలుదారులకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రెండింటి వల్ల ప్రభుత్వానికి ఇటు ఎల్ఆర్ఎస్ చార్జెస్ అటు రిజిస్ట్రేషన్ చార్జెస్ ఆదాయం వస్తుంది. ఎల్ఆర్ఎస్ చార్జెస్ రద్దు చేసినా లేదా సగానికి తగ్గించినా దరఖాస్తుదారులకు లాభం కలుగుతుంది కాబట్టి రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

- నారగొనీ ప్రవీణ్ కుమార్

ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Advertisement

Next Story