- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చేయలేనిది.. రేవంత్ ఎలా చేస్తున్నారు..?
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన హామీలు, ప్రమాణాలు, అభివృద్ధి మాటల తూటాలు, జల్, జమీన్, జాబ్స్ గురించి చేసిన మాటలు ఇప్పటికీ మన చెవుల్లో గిర్రుగిర్రు మని తిరుగుతూనే ఉన్నాయి. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలు వాగ్దానాలు ప్రమాణాలు మరిచి, ప్రజల అభివృద్ధిని చూడకుండా ఓట్లను కురిపించే వ్యవస్థలను తయారు చేయడం చూశాం. అయితే కేసీఆర్ మనోగతాన్ని పసిగట్టిన ప్రజలు మూడోసారి సీఎం సీటుకి ఆమడ దూరంలో ఉంచారు.
కేసీఆర్ తన 10 సంవత్సరాల పాలనలో చేయలేని ఎన్నో సాహసోపేత నిర్ణయాలను, ఎన్నో పనులను సీఎం రేవంత్ రెడ్డి నేడు అవలీలగా చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంస పాలనను పునర్నిర్మాణం వైపు, అభివృద్ధి వైపు తీసుకువెళ్లేలా అడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాది పాలన సందర్భంగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పాలన గూర్చి చర్చిద్దాం!
ప్రగతి భవన్ టు ప్రజా భవన్
ఆత్మగౌరవం అధికం గల తెలంగాణ ప్రజలకు, గద్దర్ లాంటి వాళ్లకు సైతం ప్రజాభవన్‌కు వెళ్లడానికి ప్రవేశ అనుమతి లేకపోవడం బాధాకరం. ప్రజల ఆస్తులను సొంత జాగీర్దార్ రాజ్యం లాగా అహంకారంతో ప్రవర్తించారు. అందుకే రేవంత్ రెడ్డి అధికారం అందుకున్న క్షణాల్లోనే కాంగ్రెస్ గేట్లు, బారికేడ్లను తొలగించి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి సామాన్య జనులకు సైతం ప్రవేశం కల్పించారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం సెక్రటేరియట్ వైపు చూడలేదు. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా అసెంబ్లీకి రాకపోవడం.. వచ్చిన ఒకేసారి కేవలం 10-15 నిమిషాల పాటు ఉండిపోవడం రాజ్యాంగ సంస్థల పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అదే రేవంత్‌రెడ్డి గురించి తెలిసిన విషయమే కదా.
నిరుద్యోగులకు ఉద్యోగాల హామీ!
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వంలో కొలువు తీరాక పదే పదే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీలు గుప్పిచ్చి, అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో కనీసం 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వలేదు, సరికదా వారిలోనూ అస్మదీయులే ఎక్కువగా ఉండటం బాధాకరం. కానీ తన కుటుంబంలో అందరికీ ఆలస్యం చేయకుండా ఉద్యోగాలు ఇచ్చారు. అంతేగాదు.. పలుమార్లు ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, నిరుద్యోగుల మరణాలు. వీటితో పోలిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలంలోనే 55వేల నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత చూశాం.
దళితుల విషయంలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని, లేకపోతే తల నరుక్కుంటానని ఆడిన మాటను అడ్డంగా పాతర వేయడమే కాకుండా, కనీసం అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని ఫొటోకి దండ వేసి నమస్కారం చేసిన సందర్భాలు చూశారా? ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అందిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారు. హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌ను ఎన్నికల్లో ఓడిం చడం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, తరువాత ఆ పథకాన్ని నీరు కార్చలేదా? కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత ఉప వర్గీకరణకు జ్యుడీషియల్ కమిషన్ వేసింది. అట్లానే ఇంది రమ్మ డబుల్ బెడ్ రూముల పథకాన్ని నిలబెట్టుకునే దశలో ఉంది.
రైతుల విషయంలో..
ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పాక్షికంగా కొన్ని దశల్లో మాత్రమే అమలు చేశారు. అనాడు మల్లన్న సాగర్, సుందిళ్ల రైతులకు సంకెళ్లు వేసిన బీఆర్ఎస్ నేడు రైతులను రెచ్చగొట్టి రాజకీయ అస్థిరత్వం సృష్టిస్తోంది. పంట నష్టం, అప్పుల్లో ఉన్నప్పుడు, రుణమాఫీ లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 12 నెలల కాలంలో దాదాపు 19,880 కోట్లు రుణమాఫీ, 7,625 కోట్లు రైతు భరోసా, 1,455 కోట్లు రైతు బీమా, ఉచిత విద్యుత్ 10,444 కోట్లు, సన్న వడ్ల బోనస్ కోసం 5,040 కోట్లు వరకు ఖర్చు చేయడం దేశ చరిత్రలోనే సాహసోపేతమైన చర్యలుగా చెప్పొచ్చు. ఫలితంగా అనంతర కాలంలో రైతుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గిన విషయం తెలిసిందే కదా !
రెవెన్యూ వ్యవస్థ, ధరణి సమస్యలు..
రెవెన్యూ వ్యవస్థలో ధరణితో కొత్త సమస్యలు సృష్టించడమే కాకుండా ఆస్మదీయులకే ఆయు ధంగా మారి కబ్జాలకు, తప్పుడు రిజిస్ట్రేషన్లకు, అవినీతికి అక్రమాలకు కేరాఫ్‌గా మిగిలింది. ఆనాడు రెవెన్యూ వ్యవస్థను విధ్వంసం చేసిన పాపాన్ని కడిగే దిశగా, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నత స్థాయి తటస్థ నిపుణులచే భూకమిషన్ వేసింది. త్వరలోనే ప్రజలు కోరు కున్న విధంగా భూ సంస్కరణలు రాబోతున్నాయి.
కేజీ టూ పీజీ ..
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలుసార్లు చెబుతూ వచ్చిన కేసీఆర్‌కి, తొలి కేజీ టూ పీజీ విద్యాలయం కట్టడానికి 9 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించడం గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వం వైపు సమగ్రంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పెద్ద మొత్తంలో పథకాన్ని ప్రవేశపెట్టడం గొప్ప పని.
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి..
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే కాళేశ్వరం కథ అందరికీ తెలిసిందే కదా. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ ధనదాహానికి బలైందనీ. రూ.97 వేల కోట్లు వ్యయం చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక పార్టీ ఆరోపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అంటూ పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ పదవి కాలం ఉన్న ప్పుడు వర్షాలు దండిగా పడటంతో చివరకు వర్షం నీటిని కూడా కాళేశ్వరం నీళ్లుగా చెప్పుకునే దుస్థి తిని మనం చూసాం. ఇలా ఒకటేమిటి ఎన్నో చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది.
భవిష్యత్ కోసం హైడ్రా & మూసీ!
రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటామని టీవీల ముందు మాట్లాడి, ఆ తర్వాత ఓట్ బ్యాంకు కొరకు హైదరాబాద్ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి కబ్జాదారులకు దాహసోమన్నాడనే అపవాదును మాజీ సీఎం కేసీఆర్ మూటగట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కన్నా భవిష్యత్ తరాల ప్రయోజనమే మిన్నగా ఆలోచించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అలాగే మూసీపై ఎన్నో డాంబికాలు పలికిన గత ప్రభుత్వం చేయలేని పనిని రేవంత్ రెడ్డి ధైర్యంగా మొదలు పెట్టడం చరిత్రలో నిలిచిపోయే చర్యగా అభివర్ణించవచ్చు.
డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659