దేశంలో రోజుకో రాజకీయ వేడి

by Ravi |   ( Updated:2023-02-22 18:31:01.0  )
దేశంలో రోజుకో రాజకీయ వేడి
X

ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడి సుప్రీంకోర్టు జోక్యంతో ఒక కొలిక్కి వచ్చింది. అయితే అక్కడ ఆప్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మేయర్ ఎన్నిక సులభం కాలేదు. మెజారిటీకి పది ఓట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ తన పట్టు వదలకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇతర ప్రజాప్రతినిధుల్ని ఎన్నికకు ముందే నామినేట్ చేసి, వారి సంఖ్యాబలంతో పదవిని లాక్కుందామనుకుంది. అయితే ఈ ఆశని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. నగరపాలక సంస్థలోని మేయర్‌ని ప్రజల ద్వారా ఎన్నికయిన వారికే ఎన్నుకునే హక్కుందని, నామినేటెడ్ సభ్యులకు అలాంటి హక్కులేదని తీర్పు చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడింది. ఇక మరో విషయంలో శివసేన పార్టీ తిరుగుబాటు వర్గమైన షిండే వర్గానికే ఎక్కువ మంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండటంతో ఎన్నికల గుర్తు విల్లు, బాణం వారికే దక్కుతాయంటూ ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఇందులో పార్టీ నియమావళి, పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకోలేదని, ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా వారికి అండగా నిలబడ్డారన్నారు ఠాక్రే. అందులో తప్పులేకపోవచ్చు కూడా. ఎందుకంటే తమతో ఉన్న గ్రూప్‌కి బీజేపీ సహాయం చెయ్యకుండా ఉంటుందా! ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో బీజేపీ‌ని తప్పుపట్టగలం కానీ శివసేన విషయం‌లో అలా అనలేం. ఈ కేసు కూడా సుప్రీం దగ్గరకు చేరింది. ఏతావాతా అనుకునేదేమిటంటే దేశంలో రాజకీయంగా అనవసరపు వేడి పెరిగింది.. కావాల్సిన వెలుతురు తగ్గింది.

డా. డి.వి.జి.శంకరరావు

94408 36931

Advertisement

Next Story

Most Viewed