- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో ముందడుగు
ఈ పరికరంతో క్యాన్సర్‌తో పాటు అర్థరైటిస్(Arthritis)రోగులకు చికిత్స అందించవచ్చు. ఈ అర్థరైటిస్ విధానంలో సైటోట్రాన్ పరికరంపై రోగిని పడుకోబెడతారు. అది విడుదల చేసే రోటేషనల్ ఫీల్డ్ క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెసోనేస్స్ కిరణాలు గుజ్జు ఉత్పత్తి నిలిచిపోయి రాపిడికి గురిఅవుతున్న కీళ్లపై ప్రసరింపజేస్తారు. ఇలా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా తిరిగి గుజ్జు ఉత్పత్తి అయ్యి ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సా విధానాన్ని రోజుకు గంట చొప్పున 21 రోజులు కొనసాగిస్తారు. ఈ సమయంలో రోగికి ఎలాంటి నొప్పి ఉండదు. సైట్రోటాన్ విడుదల చేసే 'ఆర్‌ఎఫ్‌క్యూఎమ్ఆర్' కిరణాలు 'ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ నాన్ ఐయనైజింగ్ రేడియేషన్'నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని డీఆర్‌డీఓ నిర్థారించింది.
ఇప్పుడు క్యాన్సర్‌గా పిలుస్తున్న పుండు పూర్వకాలంలో రాజులకు, సంపన్నులకు మాత్రమే రాచపుండు పేరుతో వచ్చేదని అమ్మమ్మ, నానమ్మ చెప్పే కథలలో వినేవాళ్ళం. కానీ, ఆ పుండు ఇప్పుడు బీదా బిక్కి తేడా లేకుండా ఎవరికైనా సోకుతోంది. 2018 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 42 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, అందులో 22 లక్షల 50 వేల మంది మరణించారని లోక్‌సభలో భారత ప్రభుత్వం వెల్లడించింది. యేటా గుండె జబ్బులతో 6,96,962 మంది, క్యాన్సర్‌తో 6,02,350 మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదికలో పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. గుండె జబ్బుల తరువాత అత్యధికంగా క్యాన్సర్ మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, ఈ వ్యాధి కట్టడికి ఎన్నో చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆశించిన మేర ప్రగతి సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూర్‌కి చెందిన డా. రాజా విజయ్ కుమార్(Dr.Raja vijay kumar) తన 32 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనల అనంతరం రొమ్ము, కాలేయం, క్లోమం (Pancreas) క్యాన్సర్ చికిత్స కోసం 'సెట్రోటాన్' (Cytotron) అనే పరికరాన్ని కనిపెట్టారు.
క్యాన్సర్ నిపుణుల దృష్టి ఆకర్షించి
ఈ పరికరం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడమే కాక, కణాలను శరీరంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణితి ఏర్పడిన రోగి ఏ చికిత్స చేయించుకోకుండా నేరుగా ఈ పరికరంతో చికిత్స చేయించుకుంటే కణితి మరింత పెరగకపోవడమే కాక క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందవు. ఆరోగ్య సంరక్షణ (Healthcare), ఇంధనం (Energy), ఆహారం (Food), నీరు (Water), జీవన ప్రమాణం (Quality of Life) లాంటి అంశాలలో సాంకేతిక పురోగతి సాధించేందుకు 1993లో ఆయన 'ఆర్గనైజేషన్ డిస్కేలీన్' అనే సంస్థను స్థాపించి కృషి చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయనను దేశంలోని పది మంది ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తించగా, ఐక్యరాజ్య సమితి సైతం తన విద్యామండలి సలహాదారుగా సేవలందించాలని ఆహ్వానించింది. డా.విజయ్‌కుమార్ రూపొందించినా ఈ పరికరం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ప్రతిష్టాత్మక 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'(Food & Drug Administration) అనుబంధ శాఖ అయిన 'సెంటర్ ఫర్ డివైజెస్ అండ్ రేడియాలాజికల్ హెల్త్'(Centre for Devices & Radiological earth) గుర్తింపు పొందింది.
డా.విజయ్ కుమార్ బెంగుళూర్ లోని 'సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ ఆండ్ డవలప్‌మెంట్'లో శాస్త్రవేత్త. ఆయన నానో టెక్నాలజీ, బయో ఫిజిక్స్, సస్టైనబుల్ టెక్నాలజీ విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు జరిపి సైటోట్రాన్ అనే పరికరాన్ని ఆవిష్కరించి తన లక్ష్య సాధనలో సఫలీకృతులయ్యారు. ఆయన తన సుదీర్ఘ పరిశోధన పయనంలో పదిహేను ఆవిష్కరణలకు పేటెంట్ పొందడమే కాక ఎన్నో పరిశోధనా పత్రాలు ప్రముఖ మెడికల్, ఇంజనీరింగ్ జర్నల్స్‌లో ప్రచురితమవ్వడం ఆయన ప్రజ్ఞకు నిదర్శనం. అంతేకాక, ఆయన 'సైటోట్రానిక్స్ –ఎ మిస్టరీ ఆఫ్ ది లివింగ్ సెల్' అనే పుస్తకాన్ని రచించారు ఇది మెడికల్ రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం 'యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్' (USFDA) ఆమోదం పొందడంతో ఆయన ప్రపంచంలోని క్యాన్సర్ వ్యాధి నిపుణుల దృష్టిని ఆకర్షించారు. ఈ పెట్రోటాన్ పరికరాన్ని ఆయన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం విశేషం.
క్యాన్సర్ చికిత్సతో పాటు
క్యాన్సర్ వ్యాధి సంభవించినప్పుడు రోగి శరీరంలోని కొన్ని కణాల సహజ నియంత్రణ కోల్పోతాయి. వాటిని ధ్వంసం చేసే రోగ నిరోధక శక్తిని సైతం హరించి వేస్తాయి. దీనికోసం సాధారణ క్యాన్సర్ చికిత్సా విధానంలో 'కీమో థెరపీ'(Chemotherapy),'రేడియో థెరపీ'(Radiotherapy) సహాయంతో ప్రత్యేక కిరణాలను శరీరంలో కణితిపై ప్రసరింపచేసి క్యాన్సర్ కారక కణాలను చంపివేయడం ద్వారా ఇతర శరీర భాగాలకు సోకకుండా చేయడమే ఈ చికిత్సా విధానం. ఈ చికిత్సా విధానంలో రోగి ఎంతో యాతనకు గురవుతాడు అంతేకాకుండా రేడియేషన్ కారణంగా ఇతర దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ డా. విజయ్ రూపొందించిన సైటోట్రాన్ ద్వారా అందించే చికిత్సా విధానంలో 'టిష్యూ ఇంజనీరింగ్' సిద్ధాంతం ఆధారంగా చికిత్స చేయబడుతుంది. ఈ విధానంలో రోగి శరీరంలోనీ ప్రోటీన్లలో కొన్ని మార్పులు చేసి నియంత్రించడం ద్వారా క్యాన్సర్ కారక కణాలు బహుళ సంఖ్యలో అభివృద్ధి చెందకుండా నిరోధిస్తారు. అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా చేస్తారు. అంతేకాక ఈ విధానంలో రోగి శరీరంలోకి పంపబడిన ప్రోటీన్లు క్రమ పద్ధతిలో క్యాన్సర్ కారక కణాల జీవనకాలాన్ని వేగవంతం చేసి త్వరగా మరణించేలా చేస్తాయి. తత్ఫలితంగా రోగి రోగనిరోధక శక్తి సహజంగా తిరిగి పుంజుకుని సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడేలా చేస్తుంది.
అందుకే ఈ చికిత్సా విధానం కణజాల రుగ్మతలకు సంబంధించి చక్కటి పరిష్కారంగా పరిగణించబడుతోంది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, మెక్సికో దేశాలలో వందలాది క్యాన్సర్ బాధితులు ఈ చికిత్సా విధానంలో చికిత్స పొందారు. ఈ పరికరంతో క్యాన్సర్‌తో పాటు అర్థరైటిస్(Arthritis)రోగులకు చికిత్స అందించవచ్చు. ఈ అర్థరైటిస్ విధానంలో సైటోట్రాన్ పరికరంపై రోగిని పడుకోబెడతారు. అది విడుదల చేసే రోటేషనల్ ఫీల్డ్ క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెసోనేస్స్ కిరణాలు గుజ్జు ఉత్పత్తి నిలిచిపోయి రాపిడికి గురిఅవుతున్న కీళ్లపై ప్రసరింపజేస్తారు. ఇలా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా తిరిగి గుజ్జు ఉత్పత్తి అయ్యి ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సా విధానాన్ని రోజుకు గంట చొప్పున 21 రోజులు కొనసాగిస్తారు. ఈ సమయంలో రోగికి ఎలాంటి నొప్పి ఉండదు. సైట్రోటాన్ విడుదల చేసే 'ఆర్‌ఎఫ్‌క్యూఎమ్ఆర్'(RFQMR) కిరణాలు 'ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ నాన్ ఐయనైజింగ్ రేడియేషన్'నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని డీఆర్‌డీఓ(DRDO) నిర్థారించింది.మోకాళ్ళు, తుంటి, చీలమండ, భుజం, మోచేయి, మణికట్టు, నడుము, వెన్నెముక కీళ్ళకు సైటోట్రాన్ ద్వారా చికిత్స అందుబాటులో ఉంది. అలాగే ఊబకాయంతో ఉన్నవారికి వయసు మళ్ళిన వారికి ఈ చికిత్సా విధానం ద్వారా ఉపశమనం లభించే అవకాశం లేకపోలేదు.
యేచన్ చంద్రశేఖర్
88850 50822
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672