డీఎస్సీ పైన భారీ ఆశలు..

by Ravi |   ( Updated:2024-11-28 00:31:03.0  )
డీఎస్సీ పైన భారీ ఆశలు..
X

గత ప్రభుత్వం 15 వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ లోగా సాధారణ ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభ్యర్థుల ఒత్తిడి, ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తిచేశారు. అయితే, అందులో దాదాపు 600 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి.వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. ఇక 33 జిల్లాల్లో డి.ఎడ్ బి.ఎడ్ పూర్తి చేసిన వారు మొన్నటి డీఎస్సీలో జాబ్ రాని వారు మరో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. వారు ఫిబ్రవరిలో వచ్చే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, పదవీ విరమణ పొందిన ఖాళీలు, రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు 15 వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం 6 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. ఇదైనా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం టెట్ పరీక్షకి అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డీఎస్సీపై చర్యలు వేగవంతం చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దాం.

- రావుల రామ్మోహన్ రెడ్డి

93930 59998

Advertisement

Next Story

Most Viewed