- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం మారినప్పుడు లభించే ప్రయోజనాలు
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి చాలామంది ఉద్యోగులు తాము ఒక డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యక్ష నియామకం ద్వారా ఇంకొక డిపార్ట్మెంట్ లోని పోస్ట్‌కు సెలెక్ట్ అయి వెళ్ళినప్పుడు పే ప్రొటెక్షన్ ఉంటుందా? సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా? లీవుల గురించి చాలా సందేహాలను అడుగుతున్నారు. దీనికి సంబంధించి నిబంధనలు ఈ విధంగా ఉంటాయి. ఒక ఉద్యోగంలో నియామకం పొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ, డీఎస్సీ ద్వారా గాని, ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్ ల ద్వారా ఇంకొక పోస్ట్‌కు సెలెక్ట్ అయినప్పుడు పూర్వపు డిపార్టెంటుకు టెక్నికల్ రిజిగ్నేషన్ ఇచ్చి కొత్త ఉద్యోగానికి మారవలసి ఉంటుంది. ముందుగా ఒక ఉద్యోగానికి అప్లై చేసే ముందు తన ఎంప్లాయర్‌కు తాను సర్వీస్ కమిషన్, డీఎస్సీ, ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డుల వారి నోటిఫికేషన్‌కు లోబడి అప్లై చేస్తునట్టు మొదటగా తెలుప వలసి ఉంటుంది.
పాత ఉద్యోగానికి రాజీనామా ఎలా?
ఒకవేళ నియామకం పొందిన తర్వాత తాను కొత్త ఉద్యోగానికి నియామకం కావించబడినట్లు ప్రస్తుతం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ సంబంధిత అధికారికి టెక్నికల్ డిజిగ్నేషన్ ఇచ్చి, ఎఫ్ఆర్ 26 ప్రకారం రిలీవ్ చేయమని కోరవలసి ఉంటుంది. లేదా తను కొత్తగా సెలెక్ట్ అయిన ఉద్యోగంలో చేరాలని ఉందని, పూర్వపు డిపార్ట్మెంట్ సంబంధిత అధికారికి తనను రిలీవ్ చేయవలసిందిగా దరఖాస్తు చేసుకుని అధికారిక ఉత్తర్వులు పొంది కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాలి.
పే, సర్వీస్, లీవ్ ప్రొటెక్షన్ ఇలా..!
రిలీవ్ ఉత్తర్వుల్లో స్పష్టత ఉండాలి. కొత్త ఉద్యోగంలో చేరడానికి పూర్వానుమతి పొంది రిలీవ్ అవుతున్నట్లు పేర్కొనబడాలి. ఉద్యోగికి జాయినింగ్ టైం లభించదు. ఒకవేళ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం నుండి మరల గవర్నమెంట్ ఉద్యోగానికి వెళుతున్నట్లయితే, అతనికి సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అట్లే ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం నుండి లోకల్ బాడీ గాని మున్సిపల్ సంబంధిత ఉద్యోగానికి నియామకం కాబడి వెళుతున్నట్లయితే, అతనికి పే ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అట్లే జిల్లా పరిషత్ మున్సిపాలిటీ సంబంధిత శాఖలో ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే అతనికి సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్ లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
రిటైర్మెంట్ గ్రాట్యుటీ
కానీ లోకల్ బాడీకి సంబంధించిన అనగా జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రంథాలయ సంస్థలు మొదలగు వాటిలో ఉద్యోగం చేస్తూ మరల అదే సంస్థలకు చెందిన ఉద్యోగానికి సెలెక్ట్ అయి వెళుతున్నప్పుడు వారికి పే ప్రొటెక్షన్ లభించదు. కానీ సర్వీస్ ప్రొటెక్షన్ లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ సర్వీస్ ప్రొటెక్షన్ 2004 తర్వాత నియామకం చేయబడిన వారికి రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయంలో ఉపకరిస్తుంది.
సి.మనోహర్ రావు,
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి,
96406 75288