- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలూ ఇకనైనా మారదాం... ఎన్నాళ్లిలా మోసపోదాం?
రాజ్యకాంక్షతో ఉన్న సింహం నక్కతో అన్నదట. జంతువులను మోసగించి నాకు ఓటు వేసి నన్ను రాజును చేస్తే నిన్ను మంత్రిని చేస్తా అని. నక్క ఆలోచించి ఎక్కువ సంఖ్యలో ఉన్న జింకల వద్దకు వెళ్లి సింహం మిమ్ములను రాజును చేస్తా అన్నది, కావున సింహానికి, నాకు ఓటు వేసి గెలిపించండి అంటే నమ్మిన జింకలు ఓటు వేసి సింహాన్ని, నక్కను గెలిపించాయి, గెలిచినాక సింహం నక్క కలిసి జింకల చెవులు కట్ చేసి తినడం మొదలు పెట్టినాయి. జింకలు నక్క దగ్గరికి వెళ్లి ఇంత మోసం చేస్తారా అన్నవి.
'పిచ్చివాళ్లారా! మీకు కిరీటం పెట్టడానికి చెవులు అడ్డమని చెవులు కట్ చేయడం జరిగింది, సందేహించకండి' అని నచ్చ చెప్పితే నమ్మి మళ్ళీ ఎన్నికల్లో సింహానికి, నక్కకు ఓట్లు వేసి గెలిపించాయి. ఈ సారి జింకల తోకలు కట్ చేసి తినడం మొదలు పెట్టినాయి. జింకలు కోపంతో నక్కతో 'మళ్ళీ మోసం చేశారు కదూ' అన్నాయి. అప్పుడు నక్క 'చీ! చీ! అదేమీ లేదు మిమ్ములను సింహాసనంపై కూర్చో పెట్టడానికి తోక అడ్డం అని కట్ చేయడం జరిగింది అంతే' అన్నది. సరే అని జింకలు మళ్ళీ ఓటు వేసి సింహాన్ని, నక్కని గెలిపించాయి
అప్పుడు సింహం జింకలను చంపేసి వాటి మెదడు లివరు, గుండె, ఊపిరితిత్తులను తీసుక రమ్మని నక్కను ఆదేశించింది. నక్క జింకలను చంపి మెదళ్లు తిని లివర్లు, గుండెలు, ఊపిరితిత్తులు తీసుకుపోయి సింహానికి ఇచ్చింది, అప్పుడు సింహం నక్కతో మెదళ్లు ఏవి అని అడగగా సింహంతో నక్క ఇట్లా అన్నది. 'జింకలకు మెదడు లేదు ఉంటే మనం పదే పదే మోసం చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఓటు వేసి మనని గెలిపిస్తాయా'. నిజమే అన్నది సింహం. ఈ కథ సారాంశం ఏమిటంటే... ప్రలోభాలకు లొంగిపోయినట్లైతే అధికారం రాదు. అధికారం లేకపోతే సంపద, ఉద్యోగాలు రావు, ఒక్కసారి మోసపోతే అమాయకత్వం, రెండోసారి మోసపోతే తెలివి తక్కువ తనం, మూడోసారి మోసపోతే వెర్రితనం.
పదే పదే మోసం చేస్తున్నా....
అసలు విషయానికి వస్తే... ఇక్కడ సింహం రాజకీయ పార్టీలు. నక్క ఆగ్రకుల రాజకీయ నాయకులు. జింకలు బీసీలు. స్వాతంత్య్రం వచ్చిన కానుండి రాజకీయ పార్టీలు, అగ్రకుల నాయకులు మోసం చేస్తున్నా పదే పదే మోసపోతున్నారు బీసీలు, ఇప్పటి కైనా బీసీలు తెలివి తెచ్చుకోని ఏ పార్టీ ఐనా సరే బీసీ అభ్యర్థికే ఓటు వేయండి, అప్పుడే అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తాయి, రెడ్లకు వెలమలకు, కమ్మలకు ఓటు వేసి గెలిపిస్తే వారు వారి కులాల వారే బాగుపడ్డారు. భూములు, భవంతులు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్ట్స్, ప్రభుత్వ ఉద్యోగాలలో కీలక పోస్టులు వారివే. అధికారంలో ఉన్నారు కాబట్టి వారి కులాల వారిని బాగు చేసుకున్నారు తప్పు లేదు వారిది.
ఇప్పటికైన తెలివి తెచ్చుకొండి, ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఎవ్వరికీ ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తాయో చూడండి, బీసీలకు సీట్లు ఎందుకు ఇవ్వరు అంటే... వారు గెలవరు కాబట్టి. బీసీలు తమ ఓట్లను బీసీలకు వేయరు. వారిని విడగొట్టి అగ్రకులాల వారు గద్దె నెక్కుతున్నారు, వారికి అనుచరులుగా చెంచాలుగా, బానిసలుగా బర్రెలు, గొర్రెలు, చేపలు, లక్ష రూపాయల బీసీ బంధు లాంటివి మొఖాన కొడితే ఉంటున్నాము. మందు బాటిల్‌కి ఒక రెండు వేల రూపాయలు ఇస్తే ఓటు వేస్తున్నాం, అందుకే తెలివి తెచ్చుకోని వారికి ఓటు వేయడం బంద్ చేయండి, బీసీలకు మాత్రమే ఓటు వేయండి. రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వనప్పుడు ఓట్లు ఎందుకు వేయాలి, బీసీలు పోటీ లేని కాడ ఓటు వేయకండి లేదా నోటాకు ఓటు వేయండి.
BRS పార్టీ బీసీలకు సగం సీట్లు ఇవ్వకుండా మనని ఎర్రి పుష్పాలను చేసింది కదా! ఐనా మనం బీఆర్ఎస్ పార్టీకే జై కొడతాం, జండాలు మొస్తాం, కాళ్ళు మొక్కుతాం, ఓటు వేస్తాము. ఎన్నాళ్లు మనం ఇలాగే ఉండాలో ఇప్పటికైనా ఆలోచిద్దామా... మిగతా రాజకీయ పార్టీలు ఏమి చేస్తాయో చూద్దాం... చూసి అప్పటికైనా మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం.
- నారగొని ప్రవీణ్ కుమార్
98490 40195