- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టర్కీ-ఇజ్రాయెల్ ఐక్యతారాగం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎంబసీని 'టెల్‌వివా' నుంచి జెరూసలేంకు మార్చే సందర్భంలో ఇజ్రాయెల్ సైనికులు 60 మంది పాలస్తీనీయులను చంపేశారు. దీంతో టర్కీ తన దేశం నుంచి ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించింది. 2018 నుంచి టర్కీ-ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొని ఉంది. ఆ ఘటనతో ఇరు దేశాల మధ్య పెద్ద విఘాతం ఏర్పడింది. నిజానికి పాలస్తీనా గ్రూపులకు ముఖ్యంగా హామాస్ ప్రాంతాలలో టర్కీ సహకారం అందించడం, ఇజ్రాయెల్ గాజా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించడం లాంటి సమస్యలు ఇరు దేశాల మధ్య అప్పటికే ఉన్నాయి.
టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలు, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. ఇరు దేశాల అధ్యక్షులు ఆగస్టు 17న ఇందుకోసం చేతులు కలిపారు. వీరి కలయికతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని ప్రపంచ రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ కోణంలో చూస్తే ప్రాంతీయ పరంగా లాభసాటిగా ఉండడానికి, టర్కీ వైపు నుంచి చూస్తే ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి ఈ కలయిక ఉపయోగపడుతుంది.
గత నెలలో జరిగిన సమావేశం ఇరు దేశాలు తమ రాయబారులను మార్చుకోవడానికి, ఉద్రిక్తత వాతావరణం తగ్గించుకోవడానికి, టర్కీ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశం తోడ్పడుతుంది. సైప్రస్, గ్రీస్‌తో మంచి సంబంధాలు నెలకొల్పేందుకు, సమీప దేశాలతో అంతర్గత ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి, కుర్దిష్ సమస్యలు పరిష్కారానికి వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికలలో విజయం సాధించడం కోసం ఈ సమావేశం దోహదపడుతుందని టర్కీ భావిస్తున్నది.
తన తప్పు గ్రహించి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎంబసీని 'టెల్‌వివా' నుంచి జెరూసలేంకు మార్చే సందర్భంలో ఇజ్రాయెల్ సైనికులు 60 మంది పాలస్తీనీయులను చంపేశారు. దీంతో టర్కీ తన దేశం నుంచి ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించింది. 2018 నుంచి టర్కీ-ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొని ఉంది. ఆ ఘటనతో ఇరు దేశాల మధ్య పెద్ద విఘాతం ఏర్పడింది. నిజానికి పాలస్తీనా గ్రూపులకు ముఖ్యంగా హామాస్ ప్రాంతాలలో టర్కీ సహకారం అందించడం, ఇజ్రాయెల్ గాజా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించడం లాంటి సమస్యలు ఇరు దేశాల మధ్య అప్పటికే ఉన్నాయి. గత నెలలో జరిగిన కలయిక వలన ఇటువంటి సమస్యలు తొలగిపోయి, సుహృద్భావ వాతావరణం నెలకోంటుందని, పది సంవత్సరాలుగా ఉన్న ఉద్రిక్తతలు సడలతాయని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఈ సంవత్సరం మార్చి నెలలో టర్కీలో పర్యటించారు.
తరువాత ఇరు దేశాల రాయబారుల పరస్పర పర్యటనలు, ప్రణాళికల ద్వారా ఈ రెండు దేశాల అధినేతలు కలయిక సత్ఫలితాలు ఇచ్చింది. తాజాగా టర్కీ అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్జోగ్ తన భావనలు, ప్రణాళికలు పునః సమీక్షించుకుని, ఈజిప్టు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ పట్ల తన వైఖరి పునరాలోచన చేసుకోవడం శుభ పరిణామం. తన విధానాల వలన ఈ ప్రాంతంలో తమ దేశం ఒంటరి అయిందని, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందనే అంశాలను గ్రహించి ఇస్లామిక్ దేశాలకు తానే పెద్ద దిక్కు అని భావించడం తప్పని తెలుసుకొని తన వైఖరి మార్చుకొని పొరుగు దేశాలతో కలిసి నడవడానికి అడుగులు వేస్తున్నాడు.
ఇరు దేశాల ప్రయోజనాల కోసం
అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా అరబ్, నాన్ అరబ్ దేశాలతో ప్రాంతీయ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ముందుకు వచ్చింది. టర్కీ ముఖ్య ప్రాంతీయ దేశం కావడంతో ఇజ్రాయెల్ హామాస్ ఇస్తాంబుల్‌లో ఆఫీస్ ఏర్పాటు చేసి గాజాను టర్కీ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇజ్రాయెల్ ఇరాన్ పై నిఘా పెట్టడానికి ఈ సంబంధం అత్యావశ్యకం అని భావిస్తున్నది. అంతే కాకుండా భవిష్యత్తులో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనకపోతే, తమ ప్రాంతంలో 2010లో బయటపడిన చమురు నిక్షేపాలు నుంచి గ్యాస్ తీసి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసి,ఎక్కువ మొత్తంలో నిధులు సంపాదించవచ్చనే భావనతో ఇజ్రాయెల్ టర్కీతో సత్ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
తన దేశం ఆర్థికంగా ఇంకా బలపడి ప్రపంచ ఆర్థిక రంగంలో, రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగడానికి టర్కీతో స్నేహబంధం, ఏథెన్స్, నికోసియా తో మంచి సంబంధాలు కోరుకుంటుంది. ఈ విధంగా టర్కీ-ఇజ్రాయెల్ తమ తమ ఆర్థిక ,రాజకీయ ప్రయోజనాల కోసం స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఆర్థికంగా బలపడటానికి చేతులు కలుపుతూ, నూతన శకానికి నాంది పలికారు. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఆయా ప్రాంతీయ దేశాల సమగ్ర అభివృద్ధికి, శాంతికి, ఆర్థిక రాజకీయ బలోపేతానికి ఈ బంధం బలపడాలని ప్రజాస్వామ్యవాదులుగా మనమంతా కోరుకుందాం.
ఐ. ప్రసాదరావు
63056 82733