- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఏబీవీపీ!
స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమాలు చేసి మా నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ స్వరాష్ట్రం సాధించుకుంటే, నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు గాలికి వదిలేసింది. అమరుల త్యాగాలపై ఏర్పడిన రాష్ట్రంలో, అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి పార్టీ విస్తరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై రాజకీయ పార్టీలు తమ బాధ్యతను విస్మరిస్తే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రం ఒక ప్రతిపక్షంగా నిలబడి నిరంతరం సమస్యలపై ఉద్యమాలు చేస్తూ.. ప్రజలకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమాజానికి తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ సమస్యలు మొదలుకొని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, విద్యారంగ సమస్యల వరకు ఇలా అనేక సమస్యలపై ఏబీవీపీ నిరంతరం గళమెత్తి పోరాటం చేస్తూనే ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రం వస్తే మన కొలువులు మనకు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులకు అడపాదడపా నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ప్రభుత్వంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రశ్నించని సమయంలో ఏబీవీపీ ఈ అంశాన్ని ఒక ఉద్యమంగా మార్చి, వేలాది మందితో ముట్టడిస్తే, ఈ ముట్టడిలో వేలమందిపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఉంచారు. అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికి వదిలేసి అధికార పార్టీ నాయకుల కళాశాలలను ప్రైవేట్ యూనివర్సిటీలులగా మర్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటుతున్న ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తే వారిని జైలులో ఉంచారు. ఇలా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలైతేనేమి, సాంఘీక సంక్షేమ వసతిగృహాలైతేనేమి, నాణ్యమైన విద్య అందించాలని విద్యార్థుల పక్షాన ఏబీవీపీ కృషి చేస్తుంది. విద్యార్థుల సమస్యలే పరిష్కారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రతిపక్షంలో నిలబడి ఉద్యమిస్తుంది.
ముంజంపల్లి దేవేందర్
ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్
89784 58611