వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో జరిగే అనార్థాలు..

by Ravi |   ( Updated:2023-07-26 23:30:29.0  )
వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో జరిగే అనార్థాలు..
X

వీఆర్వోలను క్రమబద్దీకరించడం, వేతన స్కేలు అమలుపరచడం వంటి ప్రభుత్వ నిర్ణయాలను ఆహ్వానించదగిన విషయం. కానీ తరతరాలుగా వస్తున్న వ్యవస్థను రద్దుచేయడం బాధకరమైన విషయం. ఒకరకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఒక రెవిన్యూ వ్యవస్థకే కాదు, అన్ని శాఖల విభాగాలకు చెందిన అధికారులకు ప్రాధమిక సమాచారాన్ని అందించడమే కాకుండా, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే వ్యవస్థ వీఆర్ఓ వ్యవస్థ. గతంలో కానల్ కార్, సుంకరీలు, నీరజీలు అన్న పేరుతో పిలిచినప్పటికీ ప్రస్తుతం గౌరవప్రదమైన పేరుతో ‘గ్రామీణ రెవెన్యూ అసిస్టెంట్’గా ప్రస్తుతం పిలువబడుతున్నారు. గ్రామాలతోనే ఉంటూ, గత సంఘటనలకే కాకుండా ప్రస్తుత గ్రామంలో జరిగే ప్రతి సంఘటనకు ప్రత్యేక్ష సాక్షి వీఆర్ఓనే. సాంకేతిక పరంగా సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందినప్పటికీ, పోలీసు విభాగం వారు శాంతి భద్రతలకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని ఇప్పటికీ వారి నుండే రాబడుతున్నారు.

రెవెన్యూ విభాగానికి సంబంధించి గ్రామంలో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నికల నిర్వహణలో, పంట నష్టాన్ని అంచనా వేయడంలో, భూముల సరిహద్దులను చూపించడంలోను సంక్షేమ పథకాల అమలు మొదలైన వాటిలో వారి పాత్ర గణనీయమైనది. ఇప్పటికే వీఆర్ఓ వ్యవస్థను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, వీఆర్ఏ వ్యవస్థను కూడా రద్దుచేయడం ద్వారా, గ్రామ స్థాయిలో రెవిన్యూ ఉద్యోగి లేకపోవడం ద్వారా పాలన సవ్యంగా సాగే అవకాశం లేదు. గ్రామానికి వచ్చిన ప్రతిశాఖ అధికారికి గానీ, ప్రజాప్రతినిధులకు గానీ, చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇట్టి వ్యవస్థ రద్దు వల్ల గ్రామానికి వచ్చిన వారిని పలకరించే వారు ఎవరు ఉండకపోవడమే కాకుండా తగిన ప్రాధమిక సమాచారాన్ని ఇచ్చే నాధుడు ఎవ్వరు ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ఏ వ్యవస్థ రద్దు వల్ల రెవిన్యూ వ్యవస్థకే కాదు అన్ని శాఖల పునాదులను కూకటి వేళ్ళతో సహా తొలగించడమే అవుతుంది. తద్వారా గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

సురేష్ ప్రోద్దార్

విశ్రాంత జాయింట్ కలెక్టర్

80080 63605

Advertisement

Next Story

Most Viewed