సుశాంత్ కేసులో.. మరో కీలక మలుపు

by Shamantha N |
సుశాంత్ కేసులో.. మరో కీలక మలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రబర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి విధితమే.

తాజాగా ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్‌కు ఈడీ సమన్లు జారీ చేశారు. సుశాంత్ ఫైనాన్షియల్ ట్రాంజక్షన్‌పై, సిద్ధార్థ్ పితాని నుంచి సమాచారం కోసం ఈడీ విచారణ జరిపి, ఇప్పటికే సిద్ధార్థ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. కాగా సోమవారం సిద్ధార్థ్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

Advertisement

Next Story