ఈడీ అదుపులో కెల్విన్… వారి గుట్టు బయటపడనుందా?

by Shyam |
Drugs case
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సినీ తారల డ్రగ్స్ కేసులో ఈడీ ఒక్కొక్కరిని విచారిస్తోంది. కీలక నిందితుడైన కెల్విన్‌ను మంగళవారం విచారిస్తోంది. దీంతో కెల్విన్‌తో పాటు తనతో సన్నిహితంగా ఉన్న వాహిద్‌, కుదూస్‌‌లను బోయిన్‌పల్లిలోని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి, నటుడు నందుకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కెల్విన్‌ బ్యాంక్‌ ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వాహిద్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నటుడు నందును 4 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story