త్రైమాసిక పరంగా ఇది మెరుగైన వృద్ధి : ఆర్థిక మంత్రిత్వ శాఖ!

by Harish |
త్రైమాసిక పరంగా ఇది మెరుగైన వృద్ధి : ఆర్థిక మంత్రిత్వ శాఖ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ మధ్య దేశ జీడీపీ గణనీయమైన వృద్ధిని సాధించిందని, ఇది భారత ఆర్థికవ్యవస్థ రికవరీకి సంకేతమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం ప్రతికూలతను నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో నమోదైన 23.9 శాతంతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన మెరుగైన వృద్ధిని సాధించిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఈ వృద్ధి మెరుగుదల భారత ఆర్థికవ్యవస్థ పటిష్టను సూచిస్తుందని తెలిపింది.

లాక్‌డౌన్‌ను క్రమంగా తొలగించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు మద్దతునిచ్చాయని నివేదిక పేర్కొంది. ప్రధానంగా, ఈ వృద్ధిని వ్యవసాయ రంగం అతిపెద్ద మద్దతును ఇచ్చింది. దీని తర్వాత నిర్మాణ, తయారీ రంగాలు వృద్ధిని తోడ్పాటునందించాయి. సేవల రంగంలో ముఖ్యంగా లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ విభాగాలు దోహదపడాయని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story