- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ హింస, జడ్జీ బదిలీపై అమర్త్య సేన్ కామెంట్
కోల్‌కతా : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్.. ఢిల్లీ హింస, ఢిల్లీ హైకోర్టు బదిలీపై కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బోల్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశాన్ని పాలించే ప్రభుత్వాలు కొలువుదీరి ఉండే ఢిల్లీలో జరిగిన హింస కలచివేస్తున్నది. భారత్.. లౌకిక దేశం. ఇక్కడ ప్రజలను మతపరంగా విభజించడం తగదు. నిజంగా మైనార్టీలనే వేధించారనుకుంటే.. పోలీసులు వారి విధులను సరిగ్గా నిర్వహించలేకపోయారని అర్థమవుతుంది. ఇది ఆందోళనకరం. హింసను నియంత్రించడానికి పోలీసుల శక్తి సామర్థ్యాలు సరిపోలేవా? లేక ప్రభుత్వమే అలసత్వం వహించిందా? అనేది దర్యాప్తు చేయాలి’ అని అన్నారు.
విద్వేష ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఢిల్లీ పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధరన్‌ను వెంటనే పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మురళీధరన్ వ్యక్తిగతంగా నాకు తెలుసు. సమయ సందర్భాన్ని బట్టి ఆయన బదిలీపై సందేహాలు రావడం సహజం. కానీ, దీనిపై నేను జడ్జిమెంట్ పాస్ చేయలేను’ అని వివరించారు. విశ్వ భారతి వర్సిటీలో చదువుకుంటున్న బంగ్లాదేశీ విద్యార్థిని బలవంతంగా పంపించేయడం నిర్హేతుకమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నదని కేంద్ర హోం శాఖ ఆరోపిస్తూ విశ్వ భారతి వర్సిటీ డిగ్రీ విద్యార్థిని అఫ్సరా అనికా మీమ్‌ను స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.