- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి 5 నుంచి ఇండియాలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది. ఇప్పటికే బీసీసీఐ తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారత్‌లో పర్యటించబోయే జట్టును ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటనకు విశ్రాంతిని ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్‌లతో పాటు పెటర్నిటీ లీవ్‌లో ఉన్న రోరీ బర్న్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన ఓలీ పోప్ జట్టుతో పాటు ఇండియాకు ప్రయాణిస్తాడు. అయితే ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే అతడిని తుది జట్టులోకి ఎంపిక చేస్తామని సెలెక్టర్లు ప్రకటించారు. జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, మార్క్‌వుడ్ లకు తొలి రెండు టెస్టుల నుంచి విశ్రాంతిని ఇచ్చారు.
ఇంగ్లాండ్ టెస్టు జట్టు
జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్
రిజర్వ్ ఆటగాళ్లు
జేమ్స్ బార్కీ, మాసన్ క్రేన్, సకీబ్ మహ్మద్, మాథ్యూ పార్కిన్సన్, ఓలీ రాబిన్‌సన్, అమర్ విర్దీ