బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్

by Shyam |   ( Updated:2021-09-04 02:36:17.0  )
EC, Huzurabad by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పట్లో నిర్వహించలేమని, తర్వాత చూద్దామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, ఒడిషాలో ఒక అసెంబ్లీకి మాత్రమే సెప్టెంబరు 30న బై ఎలక్షన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నది. హుజూరాబాద్ సంగతిని వాయిదా వేసింది. ప్రస్తుతం వర్షాలు, వరదలు, కరోనా వైరస్ వ్యాప్తి, సమీపంలో పండుగలు ఉన్నందున ఇప్పట్లో నిర్వహించవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిందని ఎలక్షన్ కమిషన్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీంతో పండుగలు ముగిసేంత వరకు హుజూరాబాద్ కు బై ఎలక్షన్ లేదని తేలిపోయింది. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయిన గంటల వ్యవధిలోనే ఎలక్షన్ కమిషన్ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం.

కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి స్థానిక పరిస్థితులు ఉప ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగా ఉన్నాయో లేవో కనుక్కున్నది. తెలంగాణ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్యారోగ్య కార్యదర్శి, డీజీపీ కూడా ఈ మీటింగులో పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొన్నట్లు ఎలక్షన్ కమిషన్ తాజా ప్రకటనలో పేర్కొన్నది. దీంతో హుజూరాబాద్‌కు ఇప్పట్లో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం లేదు.

ఇది కూడా చదవండి : సిరిసిల్లకు వరద.. హుజూరాబాద్​కు పరదా.. ఎందుకీ వివక్ష..?

Advertisement

Next Story

Most Viewed