అమిత్​ షా కోసం ఈటల వెయిటింగ్​

by Shyam |
Etala Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈటల హస్తిన పర్యటనలో భాగంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు పలువురు రాష్ట్ర నేతలతో ఢిల్లీలోనే పలుమార్లు సమావేశమయ్యారు. అయితే కేంద్ర మంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు.

ఉదయం నుంచే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోసం ఈటల ప్రయత్నాలు చేశారు. కానీ స్వల్ప అనారోగ్యం కారణంగా అమిత్​షా ఎవరికీ అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదు. అయితే ఈటల మాత్రం అమిత్ షా అపాయింట్​మెంట్​ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్పుతున్నారు. బుధవారం ఆయనతో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ స్టేట్​ చీఫ్​ కూడా ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. సంజయ్​తో కలిసి ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఈటల కలిశారు. మంగళవారం కూడా బండి సంజయ్, వివేక్‌తో కలిసి ఢిల్లీలోనే ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. అయితే పార్టీలో చేరే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

మరోవైపు రాష్ట్ర నేతలను అందుబాటులో ఉండాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పారని, దీంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో కేంద్రహోంమత్రి అమిత్ షాను ఈటల రాజేందర్ బుధవారం కలిసే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్‌లో తనకు జరిగిన పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న అంశాలన్నింటినీ కేంద్ర మంత్రి అమిత్ షాకు… ఈటల వివరిస్తారంటున్నారు.

Next Story

Most Viewed