ఈటల త్వరగా కోలుకోవాలని పాదయాత్ర

by Sridhar Babu |
padayathra
X

దిశ, కమలాపూర్: ఈటల రాజేందర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు ఆదివారం పాదయాత్ర చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పనుగట్ల యూత్, బీజేపీ నాయకులు కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు ఈటల త్వరగా కోలుకొని ప్రజాదీవెన పాదయాత్రను యధాతధంగా కొనసాగించాలని కోరుకుంటూ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈటల త్వరగా కోలుకోవాలని కమలాపూర్ రామాలయం నుండి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల అరుణ్ కుమార్, పిల్లి వినయ్, కొంతం క్రాంతి, కిన్నెర భాను, బుర్రి మహేష్, కొంతం నాగులు, మేడిపల్లి శ్రీనివాస్, బుర్రి గణేష్, కొంతం కార్తీక్, ఉడుత అజయ్, మేడిపల్లి నవీన్, అభి, శ్రీకాంత్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story