- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హరీశ్ రావుకు రోషం ఉందా.? : ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తూ వావిలాల, చల్లూరును మండల కేంద్రాలుగా ప్రకటించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు పనుల బిల్లులు, అన్ని రకాల పెన్షన్లు కూడా ఇవ్వాలన్నారు. చిన్న పంచాయితీలకు రూ. 50 లక్షలు, పెద్ద పంచాయితీలకు కోటి రూపాయలు మంజూరు చేయాలని ఈటల కోరారు. భార్య బిడ్డలను విడదీసినప్పుడు సంతానాన్ని తల్లికొకరిని, బిడ్డను ఒకరికి పంచినట్టుగా హుజురాబాద్ నాయకులను, నన్ను విడగొట్టే కుట్రలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.
వీటన్నింటినీ తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈటల నియోజకవర్గంపై మిడతల దండు చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారన్నారు. రాజ భక్తిని చాటుకోండి, బానిసలుగా బ్రతకాలనుకుంటే ఫర్లేదు, ఇలాంటి కుయుక్తులను తిప్పికొట్టే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. గాలి వస్తే గెలవలేదు, 2007 ఎన్నికల్లో ఏడింటిలో ఒక స్థానం నుండి నేను, 2008లో పదింటిలో నేనొకడిని గెల్చిన విషయం గుర్తు పెట్టుకోవాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో కూడా 58 వేల మెజార్టీ ఇచ్చానని, ఇక్కడి ప్రజలతో అనుబంధం పెనవేసుకుని ఉన్నామని.. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.
నేను పార్టీ పెడుతున్నాననంటూ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు, నీళ్లు లేని కాడ గొంతు కోయాలని చూసినవ్, ప్రాణం ఉన్నప్పుడే బొందపెట్టాలని చూసినవు అంటూ ఘాటుగా ఆరోపణలు చేశారు. పై నుండి వచ్చే ఆదేశాలతో స్థానిక పోలీసులు మావాళ్లను ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ గెలవడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెడుతుందని.. అన్ని వర్గాలు భావిస్తున్నారని ఈటల అన్నారు. చెంచాగాళ్లను, డబ్బులకు అమ్ముడు పోయేవాళ్లతో కరపత్రాలు, వాల్ పోస్టర్లు వేయిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చారని.. కుట్రలు పన్నారని కంచె చేనును మేసినట్టుగా వ్యవహరించారని, మూడు నెలల పాటు కేబినెట్ వేయకున్నా మాట మాట్లాడలేదన్నారు.
ధర్మ యుద్దంలో పాండవులు గెల్చినట్టుగా హుజురాబాద్ ప్రజలు గెలుస్తారని, ఎన్నికల వస్తే ఇంటికొకరు చొప్పున నాకు మద్దతుగా వస్తారని రాజేందర్ స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పినా కర్రు వాత పెట్టడం ఖాయమని, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంగా పోటీ చేయాలని, దొంగదారిన గెల్చే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. భావ దారిద్య్రం నాకు ఉందో.. హరీశ్‌కు ఉందో, రోషం ఎవరికి ఉందో ఆయన్నే అడగాలని ఈటల రాజేందర్ అన్నారు.