- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు ఈటల సంచలన లేఖ వైరల్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసినట్టుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ లేఖలో ఈటల తాను చేసింది తప్పేనని, సమావేశాలు జరిపింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన లీడర్లు కూడా హాజరుకావడం నిజమేనని ఒప్పుకున్నట్లు ఉంది. తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ, మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, మీరు నా వేలు పట్టుకుని నడిపించారని కూడా కేసీఆర్‌ను ఈటల కీర్తించినట్లు ఉంది. అయితే ఈ లెటర్‌లో తేదీ రాయలేదు. ముఖ్యమంత్రికి ఈటల రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా లీక్ చేశారా? లేక కావాలనే ఈ లేఖను క్రియేట్ చేశారా? అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
ఈ లేఖ సారాంశం
‘టీఆర్ఎస్ పార్టీలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో కలిసి పని చేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను. మీరు పార్టీలో నాకు స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశంతో నేను హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఎందరో మీతో సన్నిహితంగా ఉన్నా.. వాళ్ళని కాదని నాకు ఏకంగా మన పార్టీ టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. ఉద్యమ సమయంలో నన్ను వేలు పట్టి నడిపించారు. నన్ను గత ఇరవై ఏళ్ళ నుండి మీ తమ్ముడిలాగా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నాకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు’ అని ఈటల లేఖలో పేర్కొన్నట్లు ఉంది.
‘కానీ నిన్నటి నుండి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నిన్న నాపై ఆరోపణలతో కొన్ని చానెళ్ళలో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు. కానీ ఆ పనులు నేను కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చింది. కానీ పార్టీ మీద కానీ, మీ మీద కానీ నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. బెంగుళూర్ లో కానీ, పుణేలో కానీ ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశం కూడా కొందరి తప్పుడు మాటలతో నేను ముందుకు వెళ్లాల్సి వచ్చింది తప్పితే నాకు వేరే ఇతర ఆలోచన లేదు. అలా సమావేశాలు పెట్టడం, పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని రకాల పనులు చేయటం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిలా భావించి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వగలరు. జరిగిన వాటి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూ మీరు నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుండి అలాంటి తప్పులను కానీ, పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను.
‘నాతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అట్టి సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ, ఇతర జిల్లాల నాయకులను కూడా పార్టీకు విధేయంగా పనిచేసేలా చూస్తాను. మీరు నా తప్పులను సరిదిద్దుకోవటానికి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీను మరింత బలోపేతం చేయటానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను. ఇదే విషయం నేను రామ్ తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను. ఆనాడు చెప్పిన దానికే ముమ్మాటికీ కట్టుబడి ఉంటాను’ అని ఈ లేఖలో ఈటల పేర్కొన్నట్లు ఉంది.