- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ర్యాలీలో ఉద్రిక్తత.. పోలీసులకు చుక్కలు చూపించిన ఈటల అనుచరులు
దిశ, జమ్మికుంట : ఈటల రాజేందర్ ర్యాలీలో పోలీసులకు, ఆయన వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి వారు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈటల ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ కిరణ్ రెడ్డి డీజే సౌండ్స్‌కు అనుమతి లేదంటూ ఫ్యూజ్‌లను తొలగించారు. దీంతో ఈటల అనుచరులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగినా.. ఆయన వినకుండా తన వాహనంలో ఎక్కి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ అనుచరులు.. ఎస్‌ఐ బొలేరో వాహనాన్ని చుట్టు ముట్టి ఆందోళన చేశారు. దీంతో కొంతమంది ఎస్‌ఐని ఒప్పించి డీజే సౌండ్స్‌కు సంబంధించిన ఫ్యూజ్‌లను ఇప్పించడంతో గొడవ సద్దుమణిగింది. లేనట్టయితే పరిస్థితి చేయి దాటి పోయేదని స్థానికులు చెబుతుతున్నారు.
ఏసీపీ రంగంలోకి..
వల్భాపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీణవంక మండల స్పెషల్ ఆఫీసర్, ఏసీపీ విజయ్ కుమార్ రంగలోకి దిగారు. డీజే సౌండ్స్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ సీపీగా వీబీ కమలాసన్ రెడ్డి ఉన్నంత కాలం డీజే సౌండ్స్‌కు పర్మిషన్ ఇచ్చేది లేదని ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. డీజే సౌండ్స్ రాకుండా సెట్టింగ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.