‘హైదరాబాద్‌కు వెళ్లాకే కార్యాచరణ’

by Sridhar Babu |   ( Updated:2023-10-10 16:59:39.0  )
eatala
X

దిశ, హుజురాబాద్: నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు నాకు బాసటగా నిలుస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మీరెలా నిర్ణయిస్తే అలాగే మీ వెంట నడుస్తామని మాట ఇచ్చారు. అయితే ఇంకా హైదరాబాద్‌లోని సన్నిహితులతో సమావేశం కావల్సి ఉంది. వారందరితో చర్చించిన తరువాత భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ముఖ్యులు, ఎన్ఆర్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఫోన్ల ద్వారా తనకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నరో, ఏం ఆశించారో చూసిన తరువాత ఆత్మగౌరవ సమస్య ఏర్పడింది.

ఈ సలహా మేరకే…

కరోనా కష్ట కాలం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని చాలా మంది సలహాలు ఇచ్చారని ఈటల తెలిపారు. హుజురాబాద్ ప్రాంతంలో జరిగిన ఢిల్లీ సర్కారు మెడలు వంచేందుకు మిలిటెంటు ఉద్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ చైతన్యాన్ని తెలియజెప్పేందుకు 48 గంటల పాటు కమలాపూర్ మండలం ఉప్పల్ లో రైల్ రోకో కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రైల్ ప్రయాణీకులకు అన్ని విధాల సాయం అందిస్తూ ఢిల్లీ సర్కారుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతను తెలియచెప్పే విధంగా నిర్వహించామన్నారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఫైరింగ్ కు ఆర్డర్ ఇచ్చారని, హెలిక్యాప్టర్లపై పోలీస్ పహారాలు చేసినప్పటికీ వెరవకుండా ఉద్యం కొనసాగించామని ఈటల వివరించారు.

Advertisement

Next Story