కలుషిత ఆహారం తిని 30మంది అస్వస్థత…

by Shyam |   ( Updated:2020-02-14 09:37:39.0  )
కలుషిత ఆహారం తిని 30మంది అస్వస్థత…
X

కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థినులు అస్వస్థత పాల‌య్యారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణ కస్తూర్భా బాలికల విద్యాలయంలో జరిగింది. సిబ్బంది వివరాల ప్రకారం… గురువారం సాయంత్రం భోజనం చేసిన త‌రువాత వాంతులు విరోచ‌నాల‌ు అయ్యాయి. శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్‌ బొల్లేపల్లి పీహెచ్సీ నుంచి డాక్టర్లను పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు తిన‌డంతో అస్వ‌స్ధ‌త‌కు గుర‌య్యార‌ని క‌స్తుర్భా నిర్వాహ‌కులు చెప్పారు. దీంతో స్పందిచిన బాలికలు… ‘‘తినేటప్పుడు చేస్తుండగా భోజనం ఎరుపు రంగులో కనబడిందని భోజనం చేయబోము అంటున్నా సిబ్బంది పరవాలేదు తినండి’’ అని ఒత్తిడి చేయడంతో తిన్నామ‌ని, ఆ ఆహారం తినడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఈ సమాచారం ఆల‌స్యంగా అందించార‌ని అధికారుల‌పై విద్యార్థుల త‌ల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ అనితారామచంద్రన్ ఏరియా ఆసుప‌త్రికి వెళ్ళి విద్యార్థుల‌ను పరామర్శించారు. ఆమెతో డీఈఓ చైతన్య జైని, ఎమ్ఈఓ విజయరావు, ఆర్డీఓ భూపాల్ రెడ్డి తదితరులున్నారు. బాలికల అస్వస్థతకు కారకులైన సిబ్బందిని గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed