కార్గిల్‌లో భూకంపం

by Anukaran |
కార్గిల్‌లో భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌తో ఓ వైపు సతమతం అవుతుంటే.. మరోవైపు భారత్‌ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. రెండ్రోజుల క్రితం దేశ రాజధానిలో భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన ఘటన మరవకే ముందే.. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో లద్దాఖ్ కార్గిల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గురువారం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కార్గిల్‌ ఎన్‌ఎన్‌డబ్ల్యూని తాకిందని ఎన్‌సిఎస్ తెలిపింది. కాగా, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Advertisement

Next Story