కృష్ణా జిల్లాలో భూకంపం

by srinivas |
కృష్ణా జిల్లాలో భూకంపం
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో భూకంపం సంభవించింది. జగ్గయ్యపేట మండలం మక్తేశ్వరంలో భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో పెద్దపెద్ద శబ్దాలు వచ్చాయి. మరోవైపు కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో ఇళ్ల నుంచి స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా, దీని తీవ్రత 3.2 అని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూమి కంపించడం సర్వసాధారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు నెలల్లో వెయ్యిసార్లు ఇలా భూమి కంపించిందని వారు వెల్లడించారు. భూమి ఉపరితలం నుంచి లోపలికి 5 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న భూ పొరల్లో కదలికల వల్ల భూకంపాలు వస్తాయని వారు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed