ఢిల్లీలో భూకంపం.. దాని తీవ్రత ఎంతో తెలుసా..?

by Shamantha N |
ఢిల్లీలో భూకంపం.. దాని తీవ్రత ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హస్తినలో ఒక్కసారిగా భూమి కంపించింది. దేశ రాజధానితో పాటు ఆనుకోని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. దాదాపు 3-4 సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. గురుగ్రామ్‎కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేశారు. మే 29న హర్యానాలోని రోహ్‌తక్‌లో 4.6 తీవ్రతతో సంభవించిందని ఆ ప్రకంపనలు ఢిల్లీని తాకినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయని.. మీరంతా క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed