అంగారకుడిపై సూక్ష్మజీవుల సర్వైవల్?

by Shyam |
mars
X

దిశ, ఫీచర్స్ : మార్స్(అంగారకుడి)పై జీవాన్వేషణకు ‘నాసా’ పంపిన ‘పర్సెవరెన్స్ రోవర్’ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అవడంతో పాటు అక్కడి అట్మాస్పియరిక్ కండిషన్స్‌పై రీసెర్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మార్స్ అంబియెన్స్‌లో సూక్ష్మజీవులు సర్వైవ్ అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. నాసా, జర్మనీ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు చేసిన ఈ స్టడీ సైన్స్ జర్నల్ ఫ్రంటియర్స్‌లో ప్రచురితమయింది. అంగారకుడిపై జీవాన్వేషణ సమయంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకం కావడంతో నాసా, జర్మనీ శాస్త్రవేత్తలు సూక్ష్మజీవులపై పరిశోధన చేశారు. మార్స్‌ వాతావరణంలో సూక్ష్మజీవులు బతకగలవని వారు ఎలా నిర్ధారించారో తెలుసుకుందాం.

మార్స్‌పై మానవాళికి ప్రాణాధారమైన నీరు ఉందని అందరూ అనుకున్నారు కానీ, అది తప్పని ఆర్కాన్సస్ సెంటర్ ఫర్ స్పేస్ అండ్ ప్లానెటరీ సైన్స్ పరిశోధకులు తేల్చారు. ఉప్పు నీటికి అనువైన పరిస్థితులు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. నీటికి అనువైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మానవుడు బతకగలడు. మరి సూక్ష్మజీవులు సంగతేంటి? అక్కడ అవి సర్వైవ్ అవుతాయా? అనే ప్రశ్న తలెత్తగా.. నాసా, జర్మన్ ఏరో స్పేస్ శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల కోసం భూమిపై నుండే స్ట్రాటో ఆవరణంలో కృత్రిమంగా సెపరేట్ మార్షయన్ కండిషన్స్ క్రియేట్ చేశారు. MARSBOx(Microbes in Atmosphere for Radiation, Survival and Biological Outcomes experiment) సృష్టించి, అందులోకి సూక్ష్మజీవులను పంపించారు. స్ట్రాటో ఆవరణంలో అట్మాస్పియర్ మొత్తం అంగారకుడి వలే ఉంటుంది. సైంటిఫిక్ బెలూన్ ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్(బ్లాక్ మోల్డ్ ఫంగి)ను ఈ మిషన్‌లో ప్రవేశపెట్టగా.. అవి తాత్కాలికంగా జీవనం సాగించాయి. ముఖ్యంగా బ్లాక్ మోల్డ్ ఫంగి యూవీ(అల్ట్రా వాయ్‌లెట్) రేడియేషన్ పెంచినా తట్టుకొని జీవించగలిగింది.

భూమికి అవతల సూక్ష్మజీవులు మనగలుగుతాయా? తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలపై అవి మనగలిగే పరిస్థితులు ఉంటే.. అది మానవాళికి ఉపయోగకరం. ఎందుకంటే నిజంగా గ్రహాంతర వాసులు ఉంటే వారి ఆహార పదార్థాలు, వాతావరణంలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రహాలపైకి ఆస్ట్రోనాట్స్ వెళ్లినపుడు వారితో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ సర్వైవ్ కాగలవా? కాకపోతే అక్కడ కొత్త సూక్ష్మక్రిముల చర్యల ద్వారా ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. రెడ్ ప్లానెట్‌పై సూక్ష్మజీవులు బతికే పరిస్థితులు ఉంటే.. మానవుడికి భూమ్మీద నుంచి ఆహారం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ ఇంకా ఈజీ అవడంతో పాటు జీవావరణాన్ని క్షుణ్ణంగా స్టడీ చేయొచ్చు. ఇప్పటికే మార్స్‌పై సూక్ష్మజీవుల సర్వైవల్‌పై మిషన్ సక్సెస్‌ఫుల్ అయిందని, తమ స్టడీ భవిష్యత్తు స్పేస్ మిషన్స్‌కు మార్గదర్శకంగా ఉంటుందని జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ పరిశోధకుడు మార్ట ఫిలిప కార్టెసావొ తెలిపారు. మార్స్ స్పేస్ మిషన్‌లో భాగంగా వేళ్లే ఆస్ట్రోనాట్లతో.. మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఆ గ్రహానికి వెళ్తాయని, తద్వారా వారికి ఇక భూమ్మీద నుంచి ఫుడ్ తీసుకెళ్లకున్నా.. అక్కడే ఉత్పత్తి చేసుకోగలిగే అవకాశాలున్నాయా? అనే అంశాలపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisement

Next Story