మహారాష్ట్ర గవర్నర్‌ను కలసిన రవిశాస్త్రి

by Shiva |
మహారాష్ట్ర గవర్నర్‌ను కలసిన రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియార్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌లో కలిశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1 తేడాతో గెలుచుకున్నది. కరోనా సమయంలో వన్డే సిరీస్ నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు రవిశాస్త్రి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నట్లు శాస్త్రి చెప్పాడు.

Advertisement

Next Story