- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు ‘ఈ-పంచాయత్ పురస్కార్’
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరో అవార్డును చేజిక్కించుకుంది. గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండటంతో ఈ అవార్డును అందించినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్ బెహరా బుధవారం ప్రకటించారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ-పంచాయత్ పురస్కారాలను అందజేస్తుండగా 2019-20 సంవత్సరానికి గాను ఈ-అవార్డు తెలంగాణకు దక్కడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి.
మంత్రి ఎర్రబెల్లి హర్షం
సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అవార్డు దక్కిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 అవార్డులు వచ్చాయని, అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. కాగా ఈ అవార్డులు వచ్చేందుకు తీవ్ర కృషిచేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, తన పేషీ, పారిశుధ్య కార్మికులను మంత్రి అభినందించారు.
Advertisement
Next Story