'యశోద' ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి

by Shyam |
యశోద ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్న యశోద హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీని అరికట్టాలని, వాటి అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర ఆందోళన నిర్వహించిన విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ యశోద, కేర్, కిమ్స్, తుంబే, సన్‌షైన్, అంకుర తదితర ఆసుపత్రులు కరోనా పేషెంట్ల నుంచి లక్షలాది రూపాయలను వివిధ రకాల ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని సంఘటనలు వెళ్ళాయన్నారు. ఈ ఆసుపత్రులు అడ్డగోలుగా ఫీజులు వేసి రోగుల్ని దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ రాకున్నా ఇతర రోగాల పేరుతో చేరితే ఫీజులు బాదుతున్నాయని, ప్రతీరోజు సగటున లక్ష రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story