డచ్ మ్యూజియంలో.. అంధులైనా అందాలు చూడొచ్చు!

by Shyam |
duch-muesiam
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతి అందాలే కాక ప్రపంచంలోని అద్భుత కట్టడాలు, ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్స్, ఆర్ట్స్ తదితర దృశ్యాలను చూసి నయనానందాన్ని పొందుతుంటాం. కానీ అంధులు, దృష్టి లోపమున్నవాళ్లకు మాత్రం ఆ అవకాశం లేదు. అయితే వారికి కూడా అలాంటి అనుభూతిని కల్పించేందుకు డచ్ మ్యూజియం ‘బ్లైండ్ స్పాట్’‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దృష్టిలోపమున్న వారికోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఉన్న పెయింటింగ్స్‌ను పునర్నిర్మించి ఇక్కడ ప్రదర్శిస్తోంది.

దృష్టి లోపమున్న వ్యక్తులు ఆనందించేలా నెదర్లాండ్స్‌లోని అట్రెక్ట్ సెంట్రల్ మ్యూజియం ‘ది బ్లైండ్ స్పాట్’ పేరుతో ఓ అసాధారణమైన ప్రాజెక్ట్ ప్రారంభించింది. ధ్వని, స్పర్శ, వాసనలతో బ్లైండ్ పీపుల్ కూడా వాటిని ఆస్వాదించేలా వీటిని రూపొందించారు. ఫ్రూట్స్, నట్స్, చీజ్, గ్రేప్స్, బన్స్ వంటి ఆహార పదార్థాలను ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. సాధారణ సందర్శకులు ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను సందర్శించాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాలని, బ్లైండ్ స్పాట్ ఓ ప్రయోగమని, ఇది అంధుల్లో బెటర్ యాక్సెసబిలిటీ పెంచేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

‘ఇది అద్భుతమైన అనుభవం. చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆహార పదార్థాల దగ్గరకు వెళ్లగానే వాసన వచ్చింది. కానీ అవి గోడకు ఉండటంతో కాస్త తడబడ్డాం. కానీ వాటిని తడిమి చూశాక నిర్ధారించుకున్నాను’ అని ఓ అంధ సందర్శకుడు తెలిపాడు.

Advertisement

Next Story