కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by Shamantha N |
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బోనస్‌ను ప్రకటించింది. 2019-2020 బోనస్‌ను ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 30లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుండగా, ప్రకటించిన బోనస్ విలువ రూ.3,737కోట్లు అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే ఈఏడాది దసరా పండగ దగ్గర పడుతున్నప్పటికీ బోనస్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇదే క్రమంలో అనుమానాలను మొత్తం పటాపంచలు చేస్తూ ప్రభుత్వ బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story