- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో డ్రోన్‌లతో కొవిడ్ మెడిసిన్
దిశ, ఫీచర్స్ : హైపర్ లోకల్ డెలివరీ యాప్ ‘డుంజో’(Dunzo).. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మందులతో పాటు వ్యాక్సిన్ డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. డెలివరీకి మానవరహిత డ్రోన్లను ఉపయోగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలంగాణకు అనుమతి ఇవ్వడంతో డుంజో ఈ నిర్ణయానికి వచ్చింది.
విజువల్ లైన్ ఆఫ్ విజన్ (బీవీఎల్ఓఎస్)ను మించి భారతదేశంలో ప్రయోగాత్మక డ్రోన్ ఫ్లైట్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ కన్సార్టియంతో కలిసి పనిచేస్తున్నట్లు డుంజో తాజా ప్రకటనలో వెల్లడించింది. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కోసం తెలంగాణ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డుంజోతో పాటు లాజిస్టిక్స్ దిగ్గజం బ్లూ డార్ట్ ఇటీవలే తన కొత్త సంస్థ బ్లూ డార్ట్ మెడ్-ఎక్స్‌ప్రెస్ కన్సార్టియం కింద డ్రోన్ డెలివరీ వ్యవస్థల పరీక్షను ఫ్లాగ్-ఆఫ్ చేసింది. ఇక డుంజో, బ్లూ డార్ట్‌లు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతించని ప్రభుత్వం.. వైద్య సంబంధిత వస్తువులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాగ్స్, టీకాలు, వైద్య నమూనాలు, లాంగ్ టెయిల్ మెడిసిన్స్ కోసం డ్రోన్ ఆధారిత డెలివరీలను డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తోంది.
కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన మందులు, ఇతర సామగ్రి కోసం కాంటాక్ట్‌లెస్ డెలివరీని అందించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే డ్రోన్ సేవలను ఉపయోగించాయి.
ఐఐటీ కాన్పూర్‌తో కలిసి పనిచేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వ్యాక్సిన్ డెలివరీ కోసం డ్రోన్‌లను పరీక్షించడానికి కూడా అనుమతి ఇవ్వబడింది. ఇస్రో కూడా గరుడ ఏరోస్పేస్‌తో ఏపీలో డ్రోన్ సర్వీస్ టెస్ట్ నిర్వహించింది. ఎప్పటినుంచో ఈకామర్స్, ఫుడ్ డెలివరీ కంపెనీలు డ్రోన్ డెలివరీకి అనుమతివ్వాలని కోరుతున్నా.. భారతదేశంలోని ప్రైవేట్ రంగ సంస్థలకు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం డ్రోన్ల వాడకానికి అనుమతించలేదు.
డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా, ప్రాణాలను రక్షించే నిత్యావసరాలు వారిని చేరుకోగలవని మేము ఇప్పుడు నిర్ధారించగలం. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్టులో మా భాగస్వామ్యం దేశానికి దోహదపడుతుందని, సమీప భవిష్యత్తులో భారతదేశంలోని అత్యంత జనాభా కలిగిన మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులను ప్రజలకు తక్షణమే పొందే వీలు కల్పిస్తుందని మేము విశ్వసిస్తున్నాం’
– కబీర్ బిస్వాస్, డుంజో డిజిటల్ సీఈవో, ఫౌండర్