నాటుసారా స్వాధీనం.. కేసు నమోదు

by Sumithra |
నాటుసారా స్వాధీనం.. కేసు నమోదు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకారం గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 12ప్యాకెట్ల సారా లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, రెండు బైకులు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎస్సై స్వామి మాట్లాడుతూ.. నిందితులు సోమరోయిత తండా మండలం గంభీరావుపేట్ నుండి తీసుకొచ్చిన సారాను ఇక్కడ అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిస్తే.. సిద్దిపేట కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100కు, లేదా 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలనీ, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

tags: desi liquor, dubbaka police, siddipet, si swamy, bikes seized,

Advertisement

Next Story

Most Viewed