మల్లన్నసాగర్​ రైతుల ఉసురు తగిలింది !

by Shyam |
మల్లన్నసాగర్​ రైతుల ఉసురు తగిలింది !
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో గెలవొచ్చు అనుకున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని, మల్లన్నసాగర్ రైతుల ఉసురు సీఎం కేసీఆర్‌కు తగిలిందన్నారు. దుబ్బాక ఫలితాలతోనైనా కేసీఆర్ కళ్ళు తెరవాలని సూచించారు. దుబ్బాకలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందనరావుకు అభినందనలు అని, ఇది బీజేపీ గెలుపు కాదని రఘునందనరావు గెలుపన్నారు.

కాంగ్రెస్​ పార్టీకి ఓట్లు వేసిన దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుతున్నామని, కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతానికి నాంది లాంటిదేనన్నారు. టీఆర్ఎస్ ఓట్ల షేరింగ్ బీజేపీకి వెళ్లిందని, ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందేమో చూడాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఓటమిపైన లోతైన సమీక్ష చేస్తామని, కార్యకర్తలు నిరాశపడవద్దని శ్రవణ్​ కోరారు.

Advertisement

Next Story

Most Viewed