- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను చూసి నాన్న గర్వంగా ఫీలవుతున్నారు’
దిశ, వెబ్‌డెస్క్: 2018 బ్యాచ్‌కు చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో “దిశ” విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీగా కన్న కూతురుకు సీఐ తండ్రి శ్యామ్ సుందర్ సెల్యూట్ చేయడం అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం వారిని అభినందిస్తూ… సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ క్రమంలో సోమవారం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో డ్యూటిలో తండ్రీకూతుర్లిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం నాన్న నన్ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పోలీస్‌గా ఉండి కూడా ప్రజలకు సేవ చేయొచ్చు అని నాన్నను చూసి తెలుసుకున్నాను. అందుకే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యాను. అంతేగాకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఉండటం చాలా మంచిది. సమస్యలు, ప్రజల బాధ అర్ధం చేసుకొని పరిష్కారం వెతకడంలో మహిళలు ముందుటారు.’’ అని డీఎస్పీ ప్రశాంతి అభిప్రాయపడ్డారు.
అనంతరం తండ్రి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ… ’’పిల్లలు తమకంటే పైస్థాయిలో ఉండటం గొప్ప విషయం. నా కూతురును చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎంతో కష్టపడి బాగా చదవించాను. పిల్లలు ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నాను. నాలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎంచుకోవడం ఆనందంగా ఉంది. ప్రజల సమస్యలు దగ్గరుండి పరిష్కరించేది పోలీస్ డిపార్ట్‌మెంట్ అందుకే నా కూతురు పోలీస్ అయింది. ముందు ముందు ఇంకా పైస్థాయికి వెళ్లి, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్న.’’ అని శ్యామ్ సుందర్ వెల్లడించారు.