బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

by Shyam |
బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మంది వాహనదారులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఐదు కార్లు, ఏడు బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story