- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చీర్స్’ డ్రైవ్.. పట్టుబడితే జైలుకే.. అదుపు తప్పితే..?
దిశ, గచ్చిబౌలి: పరీక్షలో పాస్ అయినా, తప్పినా.. చీర్స్ కొట్టాల్సిందే. ఉద్యోగం వచ్చినా, ఊడినా..పదోన్నతి సాధించినా.. ప్రేమలో విఫలమైనా గ్లాసుల గలగలలు వినిపించాల్సిందే. నగరంలో చీర్స్ పార్టీలు జోరందుకుంటున్నాయి. నయా సంస్కృతి పబ్ కల్చర్ ట్రెండ్ యూత్ ను ఉర్రూతలూగిస్తోంది. కుర్రకారు మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ఖరీదైన కార్లతో వీరు చేసే హంగామా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. అర్ధరాత్రి వెకిలి చేష్టలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రవేశపెట్టి వీకెండ్ లో తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సత్ఫలితాలనే ఇచ్చింది. కానీ అనూహ్యంగా ఈ ఏడాది మందుబాబులు రికార్డు స్థాయిలో పోలీసులకు చిక్కారు.గడిచిన ఐదు నెలల్లో సుమారు 5 వేల కేసులు నమోదయ్యాయి.
నగరంలో గతేడాది సుమారు 8,399 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో బంజారాహిల్స్, జూ బ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీకెండ్ లో కేవలం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాం తాల్లో సుమారు 400 కేసులు నమోదవుతాయి. మాదా పూర్ లో 200, గచ్చిబౌలి లో 100 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే నగర యు వకుల అడుగులు అటు వైపు పడుతున్నాయి. పబ్ సంస్కృతితో పాటు పేరుగాంచిన బార్లు ఉండడంతో మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కు వచ్చేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు.
జైలుకు పంపినా..
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసు, ఆ తర్వాత న్యాయస్థానంలో రూ.2,500 చలానా కడితే సరిపోయేది. కానీ, ప్రస్తుతం మోటార్ వెహికల్ చట్టాన్ని మరింత పటి ష్టం చేశారు. తనిఖీల్లో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) 100 నమోదైతే డ్రైవర్ను జైలుకే పంపిస్తారు.100 ఎంఎల్ గా బ్రీతింగ్ ఎనలైజర్ లో చేరితే రెండు రోజులు, అంతకన్నా ఎక్కువ వస్తే 4 -10 రోజు ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కసారి పట్టుబడి జైలు కు వెళ్లినా తీరు మార్చుకోకపోతే నెల రోజులపాటు, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసేలా చట్టాన్ని రూపొందించారు. కానీ, జైలుకి వెళ్లినా పర్వాలేదు ఎంజాయ్మెంట్ మాత్రం కొనసాగిస్తామన్నట్టు మందుబాబులు వ్యవహరిస్తున్నారు. 2018లో 4,203 మందికి జైలు శిక్షపడగా, 2019లో 6,488 మంది, 2020 లో 1,061 మంది జైలుకు వెళ్లి వచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చట్టాలను అమలు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు సైతం..
మద్యం మత్తులో యువకులే కాదు మహిళలు కూడా పట్టుబడుతున్నారు. 2015లో ఇద్దరు, 2016 లో 09 మంది, 2017లో 13 మంది మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో 14,782 కేసులు నమోదుకాగా, 4,203 మంది జైలుకెళ్లారు. 2019లో 21,000 పై కేసులు కాగా, 6,488 మంది జైలు శిక్ష అనుభవించారు. 2020 లో 8,399 కేసులు నమోదుకాగా, 1061 మందిని జైలుకు పంపారు. గడిచిన ఏడాది కొవిడ్ -19 నేపథ్యంలో సైతం నవంబర్ చివరి వరకు ఏకంగా 19 మంది మహిళలు మందుకొట్టి పోలీసులకు దొరికారు. వీరిలో సాఫ్ట్ వేర్, వైద్య వృత్తిలో ఉన్నవారు అధికంగా ఉండడం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహి ల్స్, మాదాపూర్ లో పబ్ లు అధికంగా ఉండడంతో వీకెండ్ పార్టీల కోసం వచ్చిన మహిళలు పోలీసులకు చిక్కుతున్నారని ఓ రోడ్డు సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త రామచంద్ర తెలి పారు.
మార్పు రావాలి..
మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రజ ల్లో అవగాహన రావాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ను ప్రమాదాలు తగ్గించేందుకే నిర్వహిస్తున్నాం. కానీ కొంత మందిలో తనిఖీల్లో దొరుకుతామని భయం ఉండడం లేదు. పైగా విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. -చంద్రశేఖర్, ఏసీపీ కూకట్ పల్లి ట్రాఫిక్