నిజామాబాద్‌లో కలకలం.. ఏం జరిగిందంటే..?

by Shyam |   ( Updated:2020-07-17 23:51:12.0  )
నిజామాబాద్‌లో కలకలం.. ఏం జరిగిందంటే..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని డీఆర్ఓ కార్యాలయం అటెండర్ కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం అతడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. దీంతో కలెక్టరేట్, రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. కోవిడ్ కారణంగా ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతుల స్వీకరించేందుకు అధికారులు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed