బావిలో పడిన చేపల వ్యాన్.. ఇద్దరు మృతి

by  |   ( Updated:2021-03-29 22:31:08.0  )
బావిలో పడిన చేపల వ్యాన్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి చేపల వ్యాన్ మోట బావిలో పడిపోయింది. జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పాకివలస దగ్గర మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం డ్రైవర్, క్లీనర్ బాడీలు బావిలోనే ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నిచ్చెన ద్వారా గజ ఈతగాళ్లు బావిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపగా, దీనిని వీక్షించేందుకు చుట్టుపక్కల జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు.

Advertisement

Next Story