శివారు గ్రామాల్లో తాగునీటి సౌకర్యం..

by Shyam |
శివారు గ్రామాల్లో తాగునీటి సౌకర్యం..
X

దిశ, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఇక్కట్లను పరిష్కరించేందుకు వాటర్ బోర్డు ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసింది. ఓఆర్ఆర్‌లోని 193 గ్రామాల్లో రూ.1.5 కోట్లతో ప్రత్యామ్నాయ మంచినీటి ఏర్పాట్లు చేస్తున్నట్టు జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ… ఓఆర్ఆర్ 193 గ్రామాల్లో మంచినీటి సరఫరా జలమండలే చేపడుతున్నట్టు తెలిపారు. వేసవి కాలాన్నీ దృష్టిలో పెట్టుకుని రూ.1.5 కోట్లతో నూతనంగా 17 ఫిల్లింగ్ స్టేషన్లు, 60 మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్చి 15 నుంచి జలమండలి ట్యాంకర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed