నడిరోడ్డు మీద యువకుల పాడుపని.. ఆ సీసాలు బ్రేక్ చేస్తూ అరాచకం

by Shyam |
నడిరోడ్డు మీద యువకుల పాడుపని.. ఆ సీసాలు బ్రేక్ చేస్తూ అరాచకం
X

దిశ, మంగపేట: అర్ధరాత్రి మందుబాబులు రెచ్చిపోతున్నారు. నడిరోడ్లమీదనే మద్యం సేవిస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. మల్లూరు గ్రామం నుంచి హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో రాత్రి వేళల్లో వీరి అరాచకాలే దర్శనమిస్తున్నాయి. మల్లూరు వాగు నుంచి విశ్రాంతి మండపం రహదారిలో యువకులు రాత్రి వేళల్లో రోడ్డుపై బైఠాయించి మద్యం సేవించేందుకు అడ్డాగా మార్చుకున్నారు. తాగిన మైకంలో మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టడంతో ఆ దారిలో గుట్టకు వెళ్లే పూజారులు, సందర్శకులు, మార్నింగ్ వాకర్స్, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడే పేకాట ఆడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం మత్తులో గట్టిగా అరుస్తూ గొడవలు సైతం పెట్టుకుంటున్నారని సమీప ప్రజలు చెబుతున్నారు. అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా రోడ్డును మార్చుకున్న యువకులపై పోలీసులు దృష్టి సాధించాలని.. రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story