సూపర్ సోనిక్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో

by Shamantha N |
supersonic missile
X

డిస్పూర్: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సోమవారం మరో క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. సుధీర్ఘ దూరం ప్రయాణించే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో(స్మార్ట్) పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సోమవారం ఈ పరీక్ష చేశారు. ఈ వ్యవస్థ తరువాతి తరం క్షిపణి ఆధారిత స్టాండ్‌ఆఫ్ టార్పెడో డెలివరీ వ్యవస్థను కలిగి ఉంది.

పరీక్షా సమయంలో, క్షిపణి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. టార్పెడో యొక్క సాంప్రదాయ పరిధికి మించి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ రూపొందించబడింది. దీనిని భారత నేవీలో వినియోగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం విజయవంతమవడం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ వ్యవస్థ అభివృద్ధి దేశంలో భవిష్యత్తు రక్షణ వ్యవస్థల నిర్మాణానికి సరైన ఉదాహరణగా నిలుస్తాయని అన్నారు.

Advertisement

Next Story