- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమర జవాన్ల పేర్లు.. వేటికి పెడుతున్నారంటే
దిశ, వెబ్‌డెస్క్: లఢక్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల పేర్లను దేశంలోనే అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రిలోని వార్డులకు పెట్టాలని డీఆర్డీవో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుజరాత్‌లోని న్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కరోనా ఆస్పత్రిలోని వార్డులకు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పేర్లు పెట్టి వారి త్యాగాలను సర్మించుకోవాలని నిర్ణయించినట్టు డీఆర్డీవో ఛైర్మన్ టెక్నాలజీ అడ్వైజర్ సంజీవ్ జోషి తెలిపారు.
కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో నెలకొన్ని తీవ్ర ఉద్రిక్తతల్లో కల్నల్ సంతోష్ సహా 21 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు 43 మంది చైనీయులు కూడా చనిపోయారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. కానీ చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో మన సైనికుల్లో మనో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు. బార్డర్‌లో తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ.. చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తాము శాంతిని కోరుకుంటామని..అలాగని రెచ్చగొడితే ఊరకోబోమని స్పష్టం చేశారు.