- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏరులా పారుతున్న మురుగునీరు.. ఏమీ పట్టని అధికారులు..
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మండల కేంద్రమైన కాటారం ఇప్పల గూడెం ప్రధాన రోడ్లపై మురుగు నీటి ప్రవాహంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటారం మంథని రహదారిలో మురుగు కాలువ నీరంతా ఇప్పల గూడెం రోడ్డు పై నుండి పారుతోంది. ఈ రహదారి గుండా ప్రజలు కూరగాయల మార్కెట్ కు, ఉన్నత పాఠశాలకు, గిరిజన ఆశ్రమ పాఠశాలకు, ఎస్సీ బాలికల హాస్టల్ కు ప్రయాణం చేస్తుంటారు.
ఇదే పరిస్థితి 5 రోజులుగా నెలకొన్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు ,ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగునీరు ఈ ప్రధాన రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు పై నుండి పారుతున్న మురుగు సక్రమంగా వెళ్ళి పోయేలా మురుగు కాలువ లేదా కల్వర్టు నిర్మించాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి కి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.