- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్‌పై డాక్టర్ సమరం ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ సమరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లో చిరంజీవి అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. సోమవారం చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌తో కలిసి డాక్టర్ సమరం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించడం ఆదర్శనీయమన్నారు. ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చెయ్యడం మంచి పరిణామమన్నారు. అనంతరం పోతిన మహేశ్ మాట్లాడుతూ.. అవసరం ఉన్న ప్రతిఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని చిరంజీవి చేస్తున్నారని, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. చిరంజీవి చేస్తున్న సేవ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్ ఆపాలని కోరారు.