- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలోకి వస్తే క్వారంటైనే: పీవీ రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా వస్తే క్వారంటైన్‌కు పంపిస్తున్నామని సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ స్పష్టం చేశారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు చేపట్టిందని అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే సామాజిక దూరం తప్పని సరి అని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయని అన్నారు. అయితే దీనిని గుర్తించినా కూడా స్వస్థలాలకు చేరాలన్న ఉద్దేశంతో సరిహద్దుల్లో చాలా మంది వేచి చూస్తున్నారని, దీంతోనే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతున్నామని, దీనిని గుర్తించాలని ఆయన సూచించారు. ఆ తరువాతే వారిని స్వస్థలాలకు పంపుతున్నామని ఆయన వెల్లడించారు.
కాగా, బతుకుదెరువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. కరోనా ఆందోళన నేపథ్యంలో చావైనా, బ్రతుకైనా సొంతింట్లోనే అనుకుంటూ వారంతా రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా లక్షలాది మంది వస్తుండడంతో ఎవరికి కరోనా ఉందోనన్న అనుమానంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో వారంతా పోలీసులపై తిరగబడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. సరిహద్దుల్లోని పోలీసులపై రాళ్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోకి ఎవరినీ రానివ్వడం లేదు.
ఎవరైనా ఏ మార్గంలో అయినా రాష్ట్రంలోకి చేరినా, వారిని పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి, లేదా రాజమండ్రి పంపుతున్నారు. దీంతో రాష్ట్రంలో అడుగు పెట్టినా వారు ఇళ్లకు చేరడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోకి రావద్దని ఆయన సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ,‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఎవరూ సొంత ప్రాంతాలకు రావాలని ప్రయత్నించవద్దు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్కరం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి సౌకర్యార్థం సీనియర్ ఐఏఎస్ అధికారులైన సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ లను సీఎం నియమించారు. ఈ సందర్భంగా దయచేసి ఎవరు సొంత ప్రాంతాలకు రావద్దని సీఎం ప్రత్యేకంగా కోరారు’అని తెలిపారు.
Tags : andhra pradesh, cmo special cs, dr pv ramesh, corona, tadepalli