నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదం..

by Shyam |
నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదం..
X

దిశ, సినిమా : నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండె పోటుతో చనిపోయారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా మరణించినట్టు తెలుస్తోంది. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసే రంగస్వామి నాయుడు.. మోహన్ బాబు చేపట్టే దాతృత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవాడని సమాచారం. కాగా, తన మరణవార్త గురించి తెలుసుకున్న రైతులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలో ఆయన అంత్యక్రియలు జరగనుండగా.. మంచు ఫ్యామిలీ‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

Advertisement

Next Story