‘అర్హులైన బ్రాహ్మణులు ఉపయోగించుకోండి’

by Shyam |
‘అర్హులైన బ్రాహ్మణులు ఉపయోగించుకోండి’
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని బ్రాహ్మ‌ణ సంక్షేమ ప‌రిష‌త్ చైర్మ‌న్ డాక్ట‌ర్ కేవీ.ర‌మ‌ణాచారి అన్నారు. నిరుద్యోగుల‌కు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే భావనతో వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో వివిధ రకాల కుటీర పరిశ్రమలు, పేద బ్రాహ్మణుల పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయ‌న్నారు. ఆర్థికంగా ఎదగడానికి దోహదపడే విధంగా ఒక విద్యార్థికి రూ.20 లక్షల వరకూ ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు.

మంగళవారం బొగ్గులకుంట దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉండి ఆర్థికంగా స్థోమతలేని వారిని ప్రోత్సహించే కార్యక్రమాంలో భాగంగా బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేసే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి డాక్ట‌ర్ ర‌మ‌ణాచారి హాజ‌రై పెద్ద‌ప‌ల్లి జిల్లా సుల్త‌నాబాద్ మండ‌లం కొదురుపాక గ్రామానికి చెందిన, “కొండపాక రంగాచార్య”కు స్వయం ఉపాధిలో భాగంగా హోండా అమేజ్ కారును అంద‌జేశారు.

Advertisement

Next Story

Most Viewed