- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏం నీకంటికి నేను పిచ్చిదానిలా కనబడుతున్నానా
దిశ,వెబ్‌డెస్క్:పెళ్లి వేడుకలో అందరికంటే స్పెష్టల్ అట్రాక్షన్‌గా కనిపించాలని ఓ డాక్టర్ తన అందానికి మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించింది.ఆ ప్రయత్నంలో అందంగాఉన్న ఆమె మొహం అంద విహీనంగా తయారైంది.
ఐఐటీ గౌహతిలో చదువుకున్న డాక్టర్ బినితానాథ్ ఇటలీలో ఉంటున్నారు. అయితే తన కుటుంబ సభ్యుల శుభకార్యంలో పాల్గొనేందుకు ఇటీవల జర్మనీ నుంచి ఇండియా లోని తన నివాసమైన సిల్చార్ నగరానికి వచ్చింది. అయితే కుటుంబ సభ్యుల ఇంట్లో జరగాల్సిన శుభకార్యానికి బినితా నాథ్ అటెండ్ అవ్వాల్సి ఉందే. ఆ సమయంలో ఫంక్షన్లో మరింత అందంగా కనిపించేందుకు తన ఇంటికి స్థానికంగా ఉన్న శారద అనే బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. వాస్తవానికి బినితాకు బ్యూటీ పార్లర్ కు వెళ్లే అలవాటు లేదు.
శారద బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా బాధితురాలి మొహం మంటపుట్టడమే కాదు. ఫేసంతా నల్లగా మారింది. బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో తనకు జరిగిన ఇన్సిడెంట్ను వివరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆపోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు శారద బ్యూటీ పార్లర్ పై వస్తున్న ఆరోపణలపై యజమాని స్పందించారు. బినితా వచ్చే సమయంలో మేం పార్లర్ లో లేము. డీట్యాన్ చేసిన తరువాత బ్లీచ్ చేయకూడదు. ఆ విషయం బినితాకి మా సిబ్బంది చెప్పారు. అయినా బినితా వినిపించుకోలేదు. ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం సరికదాన్నారు. ఆ వ్యాఖ్యలపై బినితా స్పందిస్తూ నా మొహం కావాలని నేను పాడు చేసుకుంటానా..? నేను మీకు పిచ్చిదానిలా కనబడుతున్నానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని పోలీసుల్ని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.